Saturday, 31 January 2026 10:21:24 PM

రాను న్నది కాంగ్రెస్ ప్రభుత్వమే ...

అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బారాసకు ఓటమి తథ్యం

Date : 02 November 2023 08:35 PM Views : 2081

VBK News - తెలంగాణ / హైదరాబాద్ : 'ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో పాలకులు విఫలం' గోల్నాక... ప్రజల ఆకాంక్ష లను నెరవేర్చడంలో కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని భారాస ప్రభుత్వాలు విఫలమ య్యాయని కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా అధ్య క్షుడు, పార్టీ అంబర్ పేట అభ్యర్థి రోహిణ్ రెడ్డి ఆరోపించారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చాదర్ ఘాట్ తక్కీజైల్ వద్ద జరిగిన కార్యక్రమంలో.. భారాసకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆరు గ్యారంటీ'లతో తమ పార్టీ ప్రజల ముందుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో చేపట్టాక వాటిని తప్పకుండా అమలు చేస్తామని ఆయన చెప్పారు. కిరణ్కుమార్, ఫహీం, ఆజర్, సదియా, అసద్, హమీరాబేగం, మున్ని, సమీరాబేగం తదితరులు పాల్గొన్నారు.రోహిణ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నేతలు, కార్యకర్తలు భారాసకు ఓటమి తప్పదు... నల్లకుంట: అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా బారాసకు ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు కె.గోవర్ధన్రెడ్డి అన్నారు. అంబర్పేట అభ్యర్థిగా రోహిణ్ రెడ్డిని ప్రకటించిన సంద ర్భంగా ఆయన నివాసంలో కలిసి అభినం దనలు తెలిపారు. అనంతరం నల్లకుంటలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.... భారాస ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో రాను న్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో అధికారంలో చేపట్టాక వాటిని తప్పకుండా అమలు చేస్తామని ఆయన చెప్పారు. కిరణ్కుమార్, ఫహీం, ఆజర్, సదియా, అసద్, హమీరాబేగం, మున్ని, సమీరాబేగం తదితరులు పాల్గొన్నారు.రోహిణ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నేతలు, కార్యకర్తలు

Bharath

Reporter

VBK News

Copyright © VBK News 2026. All right Reserved.