VBK News - ఆర్గనైజేషన్స్ / హైదరాబాద్ : POLITICAL ANALYST AND SOCIAL ACTIVIST , JANA SANKSHEMA SANGHAM, TS STATE PRESIDENT WELCOME FOR POLITICAL NEWS AND SERVICES - WWW.VENKATANARAYANA.COM
అతనొక యువసామాజిక కెరటం. ఎవరైనా బాధల్లో ఉంటే చలించిపోతాడు. ఎక్కడైనా అవినీతి జరిగితే ఉగ్రరూపం దాలుస్తాడు. అన్యాయం జరిగితే ఎంతటివారితోనైనా తలపడతాడు. సమాజసేవకి సై అంటూ ముందుకురుకుతాడు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నిర్వహిస్తూంటాడు. భుజాన ఓ కాటన్ సంచీతో సాదాసీదాగా కనిపిస్తూ ముప్పైపదులు దాటకముందే ప్రజాజీవితంలో చెప్పుకోదగ్గ విజయాలనెన్నో సాధించిన వెంకటనారాయణ నేటియువతరానికో ఆదర్శం. రాజకీయాల్లో యువత చేపట్టాల్సిన పాత్రకి ఓ చక్కటి ఉదాహరణగా నిలచే నారాయణ అతని మాటల్లోనే ... చిన్నప్పటినుండే: నేను పాఠశాల విద్యాబ్యాసం చేసేటపుడు నా తోటి మిత్రులు వివిధ గ్రామాలనుండి హైద్రాబాద్ కు వలస వచ్చినవారే ఎక్కువగా వున్నారు వారితో కలసి మెలసి ఎక్కువగా సాన్నిహిత్యం గా ఉండేవాడిని. వారి నుండి మంచి సలహాలు సూచనలు తీసుకుంటూ వారి యాస భాషా నేర్చుకున్నాను వారి నుండే సాహిత్యం నేర్చుకున్నాను పాఠశాలలో టీచర్స్ డే గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం కార్యక్రమాలలో ఎక్కువగా పాటలు పాడేవాడిని అంతే గాకుండా నాకు విద్య నేర్పిన గురువులు చాలామంది నన్ను లైక్ చేసేవారు బహుమతులు ప్రదానం చేసేవారు 10 తరగతి వరకు నాకు మంచి గురువులు ఉన్నారు. వారినుండి ఎంతో ఓర్పు నేర్పు నేర్చుకున్నాను తదనంతరం కొన్ని పరిస్థుల రీత్యా చదువుకు బ్రేక్ పడింది వెంటనే అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో బి.ఏ. డిగ్రీ లో చేరాను. ప్రజా ఉద్యమబాటలో: ఓపెన్ యూనివర్సిటీలోని ప్రోపేసర్లు నాకు చాలా సాన్నిహితులు వారు నేర్పిన ఉద్యమ బాటలో ప్రజా నాట్య మండలి మరియు డెమాక్రేటిక్ యూత్ ఫెడీరేషన్ అఫ్ ఇండియా లో చాలాకాలంగా ప్రజాఉద్యమాలు నిర్వ హించాను కులవివక్ష వేతేరేక పోరాట సమితి అంటరానితనం రూపుమాపాలని ఎన్నో ప్రజాఉద్యమాలు నిర్వ హించాను జిల్లా స్థాయి నాయకత్వాన్ని నిర్వహించాను. పరిస్థుతుల రీత్యా 2014 జన సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాను పూర్తి స్థాయి పోరాటాలు నిర్వహిస్తున్నాను, అందులో ఎన్నో కోణాలు దాగివున్నాయి, అవినీతిపై సమరభేరి: ప్రభుత్వంలో జరిగే అవినీతిని బయటకి తీస్తూ వందలకోట్ల ప్రజాధనాన్ని కాపాడుతూ కోర్టుల్లో కేసులు వేస్తూ పోరాటం కొనసాగిస్తున్నాను, GHMC రవాణా విభాగంలో 100 కోట్ల అవినీతిని బట్టబలు చేసి కోర్టులో కేసు వేసి ౩౦ మంది అవినీతిపరులపై ఛార్జ్ షిట్ దాఖలు చేసినారు 6 మందిని అరెస్ట్ చేసారు కేసు ఇంకా విచారణ కొనసాగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఆప్కో లో 600 కోట్ల రూపాయల అవినీతిని వెలికి తీసి కోర్టుల్లో కేసు వేసి పోరాటం కొనసాగిస్తున్నాను అక్రమానిర్మాణాల పై ఫిర్యాదులు చేస్తూ వాటిని కూలగొట్టించడం జరిగింది. బిజెపి అగ్రనాయకుల బంధువులుగా చెప్పబడే ప్రతిమాహాస్పిటల్ యాజమాన్యం అక్రమంగా ప్రభుత్వ స్థలంలో కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించింది. కాచీగూడాలో ఎంతో విలువైన ప్రభుత్వస్థలం కభ్జాకి గురి అయ్యింది. ఈ అంశంపై కూడా కలెక్టరు గారికి, రెవిన్యూ మంత్రివర్యులకి ఫిర్యాదు చేసాను. వారు తీసుకునే చర్యలకి ఎదురుచూస్తున్నాను. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము.. ప్రజల కష్టార్జితం.. దీనిని అక్రమార్కులు స్వాహా చేయకుండా నా శాయశక్తులా అడ్డుకుంటూనే ఉంటాను. దీనికోసం అవసరమైతే ఎంత దూరం అయినా వెళతాను. గుర్తింపు, సేవారత్న అవార్డు: మాజీ గౌవర్నర్ కొణిజేటి రోశయ్య గారి చేతులమీదుగా సన్మానం జరిగింది సేవారత్న అవార్డు ఇచ్చారు. వివిధ సంస్థలవారిచే ఎన్నో సన్మానాలు, పురస్కారాలు అందుకున్నాను. అవార్డులు, సన్మానాల కన్నా ఎక్కువగా సేవ అందుకున్న వారి కళ్ళలో కనిపించే ఆనందం. కృతజ్ఞతాభావం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మరింత సేవ చేయడానికి స్ఫూర్తి, ఉత్సాహం కలుగుతుంది.
Admin
VBK News